వీధికుక్కలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి నగర వాసులు
August 24, 2024
నిడమర్రు రోడ్డు వద్ద గల అరవింద స్కూల్ గేటు దగ్గర స్కూలుకు వెళ్లి వచ్చే టైం లో పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలు
వీధికుక్కల బెడద లేకుండా నగరపాల సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలి
వీధికుక్కలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణ వాసులు. గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ పాదచారులను ద్విచక్ర వాహనదారులు వెంట పడుతూ అరుస్తూ కొరుకుతున్నాయని నగరవాసులు భయందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు చిన్న చిన్న గల్లీ రోడ్లలో అధికంగా ఉంటూ ప్రత్యేకించి వీధి కుక్కలను చూసి భయపడుతున్న చిన్నారులను వెంటబడి కరుస్తున్నాయి దీంతో నగరంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మంగళగిరి నగరంలోని ఆత్మకూరు ప్రాంతంలో చిన్నారుల వెంటపడి కరవడం వల్ల ఆసుపత్రిపాలై చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. మంగళగిరి నిడమర్రు రోడ్ లో గల అరవింద స్కూల్ వద్ద స్కూలుకు వస్తున్న పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు.పిల్లల తల్లిదండ్రుల సైతం ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా బాప్టిస్ట్ పేట,భార్గవ్ పేట,పాత మంగళగిరి, కొత్తపేట,బ్యాంక్ కాలనీ, పార్క్ రోడ్డు, ద్వారకా నగర్, ఇందిరా నగర్, పాత మంగళగిరి, మంగళగిరి నగరంలోని అన్ని ప్రాంతాలలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు రోడ్డుపైకి చేరి అరవటం, పోట్లాటుకుంటూ అదే సమయంలో పాదచారులు మోటార్ బైక్ పై వెళ్లే వారిపై వెంటపడి కరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి అని నగర వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.