డ్రగ్స్ మాఫియాను పారద్రోలండీ

రోజు పల్లోటి జూనియర్ కాలేజీ ఆవరణలో డ్రగ్స్ మాఫియా పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్లోటి ఫాదర్ వినోద్ అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా అమరావతి పట్టణ సిఐరీనివాసరావు విచ్చేసినారు వారు మాట్లాడుతూ డ్రగ్స్ ను పూర్తిగా నిషేధించాలి అన్నారు ఈ డ్రగ్స్ అనేది పట్టణ ప్రాంతంలో గాక
పల్లెటూరులో కూడా అవతరించింది అలాంటి సందర్భంలో ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా బాధ్యతగా చదువుకోవాలన్నారు అదేవిధంగా పల్లోటి జూనియర్ కాలేజ్ లాంటి కళాశాలలో మన పరిసర ప్రాంతంలో ఎక్కడ లేవు ఇలాంటి కాలేజీలో మీరు చదువుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటున్నాను పల్లోటి కళాశాల డైరెక్టర్ ఫాదర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచాన్నే గడగలాడిస్తున్న డ్రగ్స్ ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తరిమికొట్టాలన్నారు నేటి యువత డ్రగ్స్ బారినపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అన్నారు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ విన్నెరసి ు సిస్టర్ డియానా మాట్లాడుతూ ఈ డ్రగ్స్ అనేది ఒక మగ వారే కాకుండా ఆడపిల్లలు కూడా తీసుకుంటున్నారు ఇది చాలా బాధాకరం అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహ పల్లోటి కాలేజీ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు