వాహనదారులు మద్యం సేవించి, త్రిబుల్ రైడింగ్,

ఆకతాయిగా తిరుగుతూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ విజ్ఞప్తి వాహనానికి సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడపరాదని వాహనదారులను హెచ్చరించారు వాహనదారులు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా, మద్యం సేవించి, త్రిబుల్ రైడింగ్ మరియు రాత్రులు ఆకతాయిగా తిరుగుతున్న వాహనదారులను మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. మంగళగిరి ఎన్నారై వై జంక్షన్ వద్ద రాత్రులు మద్యం సేవించి, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని, అలాగే ఆకతాయిగా తిరుగుతున్న వాహనదారులను, అనుమానపదంగా తిరుగుతున్న పలు వాహనాలను తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రుల పూట ఆకతాయిగా తిరిగి ప్రమాదాలు కొనుతెచ్చుకోవద్దని మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగితే నష్టం వాటిల్లుతుందని, అనుమానాస్పదంగా తిరుగుతున్న పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని, త్రిబుల్ రైడింగ్ బుల్లెట్ షాట్స్, చేయకూడదని, రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ తనదైన శైలిలో వాహనదారులను హెచ్చరించారు.