*సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజుకు సత్కారం.

 ఘనంగా ముగిసిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు*

సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజుకు సత్కారం.

విజయవాడ నవంబర్ 24(అక్షర కృష్ణ): మల్లె తీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిసాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై రచయితలు, కార్టూనిస్ట్ లు, కవులు, గాయకులు పలువురిని కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతి రావు ( బాషా ప్రవీణ) ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు కలిమి శ్రీ (మల్లె తీగ), సీనియర్ జర్నలిస్ట్ యేమినేని వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.