రైతుల ఆర్థిక, సామాజిక ప్రగతిలో కీలకంగా సహకార బ్యాంకులు.
ఆప్కాబ్ ద్వారా సహకారరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు.
డీసీసీబీల సేవల్ని రైతుల పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి.
కేంద్ర సహకార బ్యాంకు వారోత్సవాల్లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
వినుకొండ నవంబర్ 20(అక్షరకృష్ణ ):రైతుల ఆర్థిక, సామాజిక ప్రగతిలో కేంద్ర సహకార బ్యాంకులు, సహకార సంఘాలది కీలకపాత్ర అని, వాటి బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ఇతోధికంగా కృషి చేస్తున్నాయన్నారు వినుకొండ ఎమ్మె ల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు గృహ నిర్మాణం, పిల్ల ల చదువులు, డ్వాక్రా సంఘాలకు కూడా రుణాలిస్తూ డీసీసీబీలు పరిధిని విస్తరిస్తూ ఉండడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. శావల్యాపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ నెహ్రూ హయంలో పంచవర్షప్రణాళికల్లో భాగంగా మొదలు పెట్టిన కేంద్ర సహకార బ్యాంకుల వ్యవస్థ నేడు మహా వృక్షంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం ఆప్కాబ్ ద్వారా కోట్లాది రూపాయల నిధులిస్తూ సహకార సంఘాలను బలోపేతం చేస్తోందని, కేంద్రంలో మోదీ సర్కార్ రూ.20 లక్షల కోట్లతో వీటి మెరుగుదలకు ఖర్చు చేస్తోంద న్నారు. ఎరువుల పంపిణీలోనూ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు కీలక భూమికని, గతంలో ధాన్యం, కందుల, శనగల కొనుగోలు వంటివాటి కొనుగోళ్లతో సొసైటీలు కష్టకాలంలో రైతుల్ని ఆదుకునేవన్నారరు. రుణాలు, విత్తనాలు, పురుగుమందుల పంపిణీలోనూ వాటికి కీలక భూమిక అని, తక్కువ వడ్డీకి వారిస్తున్న రుణాల్లోనూ ప్రభుత్వం పావలా వడ్డీ కింద కొంత మొత్తం తిరిగి చెల్లిస్తోందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆ పావలా వడ్డీ, రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణాలు, పంటల బీమా అన్నీ నిర్వీర్యం చేశారని వాపోయారు. ఫలితంగానే మద్దతుధరలు లేక పంట నష్ట పరిహారాల్లేక రైతు ఆత్మహత్యల్లో నాడు ఏపీ రెండవ స్థానంలో నిలిచిందని,కూట మిప్రభుత్వంలో ఆ దుస్థితి మార్చుతున్నామన్నారు. ఆకలివర్షం, తుపాన్ల వంటివిపత్తుల నుంచి రక్షణకు ప్రభుత్వం అందిస్తోన్న పంటల బీమా కోసం అందరు ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని కోరారు. ఉద్యాన, కూరగాయల పంటల ద్వారా అధికాయ మార్గాల్లోకి మారాలని విజ్ఞప్తి చేశారు.

