పెట్టుబడుల సునామీతో రైజింగ్ ఆంధ్రా సత్తా మళ్లీ రుజువైంది: చీఫ్ విప్ జీవీ
విశాఖ సదస్సు ద్వారా రాష్ట్రాభివృద్ధికి బలమైన బ్లూ ప్రింట్: జీవీ ఆంజనేయులు.
విశాఖ సీఐఐ సదస్సులో వెల్లువెత్తిన పెట్టుబడుల సునామీతో రైజింగ్ ఆంధ్రా సత్తా మరోసారి రు జువైందని, అయిదేళ్లలో పైసా తీసుకునిరాని వైకాపా వాళ్లు దానిపై చేసే పనికిరాని విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన బ్లూప్రింట్ ఇచ్చిన ఇలాంటి కార్యక్రమంపైనా బ్లూ మీడియా విషం కక్కడం విషాదకరమని మండిపడ్డారు. 12 ప్రధాన రంగాల్లో 13.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదరడం రాష్ట్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ అన్న జీవీ అందుకు సంతోషించాల్సింది, సంబరాలు చేయాల్సింది పోయి చౌకబారు విమర్శలు చేయడం వైకా పా దివాళాకోరు, దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కూటమి మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి న 20లక్షల ఉద్యోగాలకు మించిన ఫలితాలు వచ్చేలా జరుగుతున్న కృషిని ఓర్వలేని ఏడుపుల ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబు అనే అయస్కాంతం ప్రపంచవ్యాప్త పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నంత వరకు ఇకపై ఏపీ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన కోసం సమగ్ర విధానాలతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సుతో రాష్ట్ర ఆర్థిక జీవనాడిగా ఉన్న విశాఖకు బలమైన పునాది పడిందని, పెట్టుబడిదారుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం లక్షల కోట్ల పెట్టుబడులే అన్నారు. మంచి పాలన, ఆకర్షణీయ మైన విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం... అన్నీ వెరసి అంతర్జాతీయ పెట్టుబడి దారులకు ఏపీని అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెట్టాయని తెలిపారు. ఇదే సమయం లో అభివృద్ధి వికేంద్రీకరణపైనా కూటమి ప్రభుత్వం అత్యంత దృష్టి సారించిందని స్పష్టం చేశారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి సమతుల అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. స్టార్టప్స్ నుంచి మెగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం వల్ల ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇదే వేగం కొనసాగితే ఏపీ దేశంలోనే పెట్టుబడులకు నంబర్ –1 డెస్టినేషన్ అవుతుంది విశ్వాసం వ్యక్తం చేశారు.

