మహా మండపము 4 అంతస్తు కార్యనిర్వాహణాధికారి వారి కార్యాలయం నందు దేవస్థాన సిబ్బందితో పరిచయ కార్యక్రమం.

 నూతనంగా నియమితులైన దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణను మరియు పాలక మండలి సభ్యులను దేవస్థానం సిబ్బందికికార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ శీనా నాయక్ పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, తాము భక్తి, సేవానిరతితో ఈ బాధ్యతలు చేపట్టామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని విషయాల్లో ఈఓ కి సహకరించాలని ఆయన సిబ్బందిని కోరారు. దేవస్థానం ప్రతిష్టను పెంచేందుకు ధర్మకర్తల మండలి ఒకే జట్టుగా పనిచేస్తుందని ఈఓ గారికి ఆయన హామీ ఇచ్చారు.అనంతరం ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు బృందంగా ఆలయ ఆస్తులను పరిశీలించి ఆలయానికి చెందిన ప్రతి అంగుళం భూమిని, ఆస్తిని కాపాడేందుకు కృషి చేస్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు.పరిచయ కార్యక్రమం ముగింపులో ఈఓ శ్రీ సీనా నాయక్ మాట్లాడుతూ, భవిష్యత్తులో బోర్డు సభ్యులు, ఈఓ కలిసికట్టుగా పనిచేసి, ఆలయాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామని, భక్తులకు అత్యుత్తమ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.