భక్తులకు ఆధ్యాత్మిక, ధార్మిక సేవల విస్తృతపరిచే దిశగా ముందుకు సాగాలని దేవస్థానం ఈవో శీనా నాయక్ సిబ్బందిని ఆదేశించారు.దేవస్థానం సిబ్బందితో కలసి వివిధ ప్రదేశాలు క్షేత్రస్థాయి లో పరిశీలన చేశారు.ఇంద్రకీలాద్రిపై పూజా మంటపంలో అన్ని ప్రధాన పూజలు ఒకే చోట జరిగేలా ఏర్పాటు చేసినట్లు, కార్తీక మాసం మొదటి వారం నుండి లక్ష కుంకుమార్చన తదితర పూజలు అక్కడే జరిపేలా వైదిక కమిటీకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. పూజా మంటపం, యాగ శాల పరిశీలన చేశారు.భక్తులు కొబ్బరికాయ కొట్టే ప్రదేశంను మార్పు చేసినట్టు, ప్రస్తుతం ఉన్న ప్రదేశం లో కొబ్బరికాయ నీరు వలన దుర్వసన రావడం, భక్తులు ఆ నీటి వలన జారిపడటం వంటి భక్తులు పిర్యాదు మేరకు పరిశీలన చేసి, శివాలయం నవగ్రహ మండపం ప్రాంతం లో విశాలమైన ప్రదేశం లో గాలి వెలుతురు వచ్చే చోట ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు.మల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంగణం మరింత సుందరంగా తీర్చిదిద్దాలని, నగర ప్రజలకు కనిపించేలా ఓం నమశ్శివాయ లేదా ఓం మల్లేశ్వరాయనమః అనే లైటింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని శీనా నాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.రాజగోపురం ముందు గల దేవస్థానం ప్రధమ చికిత్స కేంద్రాన్ని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం రాజగోపురం లోపల ఉన్న ఆర్జిత సేవలు కేంద్రం, చీరల కౌంటర్ ప్రత్యామ్యాయ ప్రదేశానికి మార్చి రావి చెట్టు ప్రాంతం లో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం పెంపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా చీరల గోడౌన్ పరిశీలన చేశారు.ఇంద్రకీలాద్రి పై ఆధ్యాత్మిక వాతావరణం ఫరిఢవిల్లెలా ఉపయోగం లేని వస్తువులు తీసివేసి, పచ్చదనం పెంపొందించాలని ఈవో ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమీషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.