వాహనదారులదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్
October 14, 2024
అండ్ బి రోడ్లు మండల కేంద్రమైన అమరావతి బస్టాండ్ సమీపంలో గల సత్తెనపల్లి క్రాస్ రోడ్డు లో నీ మొకాళ్ళ లోతు గుంటలు పడటంతో పాద చార్యులు.వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాలు పడితే ఆ ప్రాంతం జలమయంతో పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మోకాళ్ళ లోతు గుంటలు పడ్డ రోడ్లపైనడపాలంటే ప్రజలకు వాహనదారులకు ప్రాణాంతకంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతినిత్యం రద్దీతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్లు కుంగిన పగిలిపోయిన గుంటలు పడిన ఇటు పంచాయతీ వారు గానీ ఆర్ అండ్ బి అధికారులు గానీ నమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించటం వల్ల అన్ని రకాల వాహనదారులు అరచేతిలొప్రాణాలు పెట్టుకుని గుంటలు దాటాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు గుంటల్లో వాహనదారుల వాహనాలతో దాటాలంటే తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు గమనించి రోడ్లో మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు సుఖాంతమైన ప్రయాణానికి అవకాశం కల్పించాలని ప్రజలతోపాటు పెదకూరపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు సిపిఐ నాయకులు బైరా పట్నం రామకృష్ణ శరణం విజయ కారంపూడి చెన్నకేశవరావు డిమాండ్ చేశారు