మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుని అరెస్ట

సదరు ముద్దాయి పై గతంలో గంజాయి లిక్కర్ కేసు లు ఉన్నట్లు వెల్లడి మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన యెడల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు.పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన గాడిదపాటి రాజు అనే వ్యక్తి అపార్ట్మెంట్ లకు వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫిర్యాది ఆత్మకూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా పనిచేస్తున్న సమయంలో ఆత్మకూరు గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు అనే వ్యక్తి తన కూతుర్ని వెంబడించి ప్రేమించమని ఇబ్బంది పెట్టినట్లు వేధిస్తున్నట్లు ఈ విషయం ఫిర్యాది కి తెలిసి గతంలోనే ముద్దాయిని మందలించారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ముద్దాయి తన మోటార్ సైకిల్ పై వెళ్లి మైనర్ బాలికను బలవంతంగా తన బండిపై ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్లో రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేయడమైనది సదర ముద్దాయి కి గతంలో గంజాయి , లిక్కర్ కేసులు ఉన్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు. ఫిర్యాది ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసును త్వరితగతముగా పూర్తిచేసి ముద్దాయిని కోర్టు నందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ సురేష్ ముద్దాయికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు