ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం

ఆధ్వర్యంలో సర్పంచ్ల ఒక నెల వేతనాన్
ని 3,92,91,000 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రాంతంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని సీఎం రిలీఫ్ ఫండ్ కు అంగీకార ప్రాంతం ఈరోజు ఇవ్వడం జరిగినది ........ ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి సర్పంచ్ల ఒక నెల వేతనాన్ని తీసుకోవాలని కోరుతూ పవన్ కళ్యాణ్ కి అంగీకార పత్రం ఇవ్వటం జరిగినది... ... ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణా నది వరదలు, వర్షాభావం తో అనేక జిల్లాలో అతలాకుతలం అయి ఉన్నాయి. సుమారు 400 మూడు గ్రామపంచాయతీలు వరదల్లో నష్టపోయినవి,ఈ గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ సొంత నిధులతో గ్రామపంచాయతీకి లక్ష రూపాయలు ఇవ్వటం జరిగినది, వారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము .ఇదే స్ఫూర్తితో సర్పంచుల గౌరవ వేతనాన్ని ఒక నెల సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది.. .... అలాగే గత రాష్ట్ర ప్రభుత్వం వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ ,గ్రామపంచాయతీలు నిర్వీర్యం అయినవి, నూతన ప్రభుత్వం ఐదవ ఆర్థిక సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని, సర్పంచ్ల వేతనం పెంచాలని, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డుల జీతాలను కేంద్ర ప్రభుత్వం మే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ నిధులను సర్పంచుల ఆధ్వర్యంలోని జరిగే విధంగా కృషి చేయాలని ,గ్రామ పంచాయతీలకు రావలసిన సర్ చార్జి , సేనరేజీ గ్రాండ్లను రెగ్యులర్గా గ్రామపంచాయతీలకు విడుదల చేయాలని, తదితర సమస్యలపై పవన్ కళ్యాణ్ వివరించడం జరిగినది.. స్పందించిన పవన్ కళ్యాణ్ గారు త్వరలో సచివాలయంలో సర్పంచులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది.
.ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ,సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కృష్ణమోహన్, సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగమణి ,అశోక్ ,శ్రీరామ్ మూర్తి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు