పల్నాడులో వైఎస్ఆర్సిపీ మాజీ ఎమ్మెల్యే పై తెలుగుదేశం పార్టీ గుండాల దాడి
September 11, 2024
పెదకూరపాడు
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించి,బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నంబూరు శంకర్రావు పై టిడిపి నాయకులు దాడులు చేయటం హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. ఈ దాడిలో వైయస్సార్ సిపి నాయకులు కార్లు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను హరిస్తూ ప్రతిపక్షాన్ని పాతాళానికి తొక్కలని ఉద్దేశంతో మంచి చెడును మరిచి మానవత్వాన్ని వదిలేసి మనసున్న నాయకుడి పై దాడి చేయడం విచారించాల్సిన సందర్భంగా ఆయన అన్నారు . గత ప్రభుత్వంలో నంబూరు శంకరరావు చేసిన అభివృద్ధి సంక్షేమాలను ఓర్వలేకే ఇలాంటి దాడులకు దిగారని ఆయన అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారని బాధితులను పరామర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అధికారమనేది ప్రతిపక్షం అనేది ఎల్లప్పుడూ ఉండదని ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతూనే ఉంటాయని అది తెలుసుకొని గ్రహించి ముందడుగు వేయాలని కోరారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతులను పరామర్శిస్తామని వారిని ఓదార్చి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా పాల్గొన్నారు.