ఇంజనీరింగ్ అధికారులు 6 గంటలు శ్రమించినా ఇంచు కదలని బోట్లు

అమరావతి:
సెప్టెంబర్ 10 కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసే ప్రక్రియ ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి బోట్లను నదిలోంచి బయటకు తీసేందుకు రెండు క్రేన్ లతో శ్రమించారు ఇంజనీరింగ్ అధికారులు. 6 గంటల పాటు శ్రమించినా ఇంచు కూడా కదల్లేదు బోట్లు. మరోసారి రేపు ఉదయం బోట్లను బయ టకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా డైవింగ్ బృందంతో బోట్లను బయ టకు తీయనున్నారు అధికారులు.50 టన్నుల భారీ క్రేన్ సాయంతో బోట్ల తొలగింపునకు ప్రయ త్నాలు..ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను అధికారులు ఇవాళ ప్రారంభించారు. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. అధికారులు. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొని నీటిలో చిక్కుకున్నాయి. వాటిని తొలగించి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు