వరద బాధితులకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించండి- భాష్యం పిలుపు

అమరావతి బెంజ్ న్యూస్
:వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు వాంబే కాలనీ 60 వార్డులో ఆయన పర్యటించి వరద బాధితుల ను పరామర్శించారు.వారికి కూరగాయలు నిత్యవసరకులు అందజేశారు. వరద సహాయ చర్యలో పాల్గొన్న అధికారులను అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ చౌదరి, అసిల్ తదితరులు పాల్గొన్నారు