గో బ్యాక్ శంకర్రావు అంటూ నిరసన పెదకూరపాడు
September 10, 2024
పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటనను వ్యతిరేకిస్తూ జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ముంతాజ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వరదలు వచ్చి 10రోజులు గడుస్తున్నా ఆయనకు నియోజకవర్గం ఇంతవరకు కనిపించలేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు పలువురు మహిళలు పాల్గొన్నారు. మరోవైపు, ఆయన కాన్వాయ్‌పై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.