పత్రికా ప్రకటన నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS .

ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలానే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభన. చిత్తూరు పట్టణములోని దర్గా దగ్గర ఉన్నటువంటి ఏ.ఆర్. టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ నందు IOCL వారి సహాకారం తో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ పోలీసు అధికారులు మరియు IOCL సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బముగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 8 నెలల సమయంలో దీనిని పూర్తి చేసామని పోలీసులతో పాటుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికి అందుబాటు లో ఉండి నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలానే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ సిద్దం చేసామని తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ ను నెలకొల్పడానికి సహాయ సహకారాలు అందించిన IOCL తిరుపతి డివిజన్ ఆఫీస్ జనరల్ మేనేజర్ రోహిత్ మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ IOCL సిబ్బందిని మరియు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంబించడానికి ఎంతో కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్.ఆరిఫుల్లా, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఏ.ఆర్. డి.ఎస్పీ లు శ్రీ మహబూబ్ బాష, ఇలియాస్ బాష, ఎస్.బి. ఇన్స్పెక్టర్ మనోహర్, పట్టణ ఇన్స్పెక్టర్ లు జయరామయ్య, నెట్టికంటయ్య, శ్రీనివాస రావు, నిత్యబాబు, ఆర్.ఐ.లు శ్రీ భాస్కర్, సుధాకర్, ఏ.ఓ. మోహన్ రావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.