సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంటి ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక
August 22, 2024
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గురువారం చంటి ముదిరాజ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.గతంలో ఇదే సంస్థలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో అవగాహన సదస్సులు పెడుతూ ప్రజలను, విద్యార్థులను చైతన్య పరుస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు మరియు జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,నంగునూరు మండల అధ్యక్షులు అశోక్ యాదవ్,గుండెల రాయుడు,బోదాస్ జగన్, ఎం.డి మున్న,జి.భాను ప్రసాద్, వెంకటేష్ యాదవ్,నమిండ్ల హరీష్,పాల్గొన్నారు..