లింగ వివక్షత పై అవగాహన సదస్సు
August 10, 2024
ఈరోజు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ ఆవరణలో లింగ వివక్షత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ సిబ్బంది తండు లక్ష్మణ్ అధ్యక్షత వహించారు , ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది బత్తుల బాబు మాట్లాడుతూ మన సమాజంలో సాంప్రదాయాలు సంస్కృతి ప్రభావం వలన ఈ లింగ వివక్షత ఏర్పడిందన్నారు దీన్ని సమతుల్యం చేయడానికి విద్యలో సమానత్వం ఒక ప్రధానమైన అంశంగా ప్రభుత్వాలు సూచించాయి అందులో భాగంగానే సర్వ శిక్ష అభియాన్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యా పథకం మరియు గురుకుల పాఠశాలలో ఉద్భవించాయన్నారు,
లక్ష్మణ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని ఆడ మగ అనే బేధం లేకుండా సమానంగా పెంచాలన్నారు పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర వహించాలన్నారు
గుడ్ షెఫర్డ్ సంస్థ డైరెక్టర్ సుపీరియర్ సిస్టర్ విన్నెరసి గారు మాట్లాడుతూ ఈ సమాజంలో జండర్ డిస్క్రిమేషన్ ఎక్కువగా ఉందన్నారు ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వాళ్ళ హక్కులని కాలరాస్తున్నారు అమ్మాయికి 19 సంవత్సరాలు నిండిన తర్వాత అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు చేయడం మంచి పద్ధతి అన్నారు కానీ ఈ సమాజంలో ఆడ మగ తేడా చూపించి మహిళలను అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల శ్రద్ధ వహించి వారి చదువుకి మంచి సహకారం అందించాలన్నారు ,ఈ కార్యక్రమంలో సిస్టర్ డియానా సమస్త సిబ్బంది పవన్ , బ్యుల మరియమ్మ ,మహిళలు తల్లిదండ్రులు ,పాల్గొన్నారు