గొడవలకు, కొట్లాట్లకు, అల్లర్లకు పాల్పడి తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ విజ్ఞప్తి చేశారు
August 10, 2024
మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో జరిగిన గొడవలో మంగళగిరి టౌన్ కు చెందిన తొమ్మిది మంది యువకులు అరెస్ట్ చేసిన రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఈనెల 6వ తారీఖు రాత్రి జరిగిన గొడవలో నిడమర్రు గ్రామానికి చెందిన కలవకొల్లు నాగరాజు ను మంగళగిరి టౌన్ కు చెందిన కుర్ర గణేష్ ఏసుబాబు కూరాకుల మాధవ్ తాడిపోయిన పూర్ణ శంకర్ కొంతమంది యువకులు దాడి చేశారు.అదే రోజు రాత్రి మంగళగిరి టౌన్ పార్క్ రోడ్లో, ఎయిమ్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద హల్చల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. గొడవలో గాయపడిన నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వెంకట్ కేసు నమోదు చేసి 9 మంది వ్యక్తులను అరెస్టు చేసి శనివారం కోర్ట్ లో హాజరపరచగా జడ్జి తొమ్మిది మందికి 14 రోజులు రిమాండ్ విధించారు.మండలం రూరల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఎటువంటి దాడులకు, అల్లర్లకు పాల్పడిన యెడల వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై వెంకట్ హెచ్చరించారు.