ఫారెస్ట్ భూముల్లో ప్రొక్లైనర్ తో రంగప్రవేశమా?

రాజధా
ని ప్రాంతం గ్రామాల్లోనే సంబందిత శాఖలు అధికారులు ఇంత నిర్లక్ష్యమా ఫారెస్ట్ భూములపై కన్నేసిన వైనం. ఆ వ్యక్తికి అధికారులే అండదండలా?. అతను ఫోన్ చేస్తేనే అక్కడకు వెళ్తున్న ఆయా శాఖలకు సంబదించిన కొందరు సిబ్బంది? అసలు మంగళగిరి మండలం పరిదిలోని ఎర్రాబాలెం కొండ ప్రాంతంపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది? పెదవులు దాటని అదేశాలు. యథేచ్చగా అక్రమ పనులు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రాబాలెంలో గతంలో ఇదే ప్రాంతంలో అక్రమణలపై తాశీల్ధార్, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తమదైన శైలిలో హెచ్చరిక జారీ చేసిన దళారులు తిరిగి పేదల భూములపై కన్నేసిన వైనం తాజాగా ఎర్రాబాలెం గ్రామంలో కొండ ప్రాంతంలో ఫారెస్ట్ భూముల్లో ప్రొక్లైనర్ తో మట్టి తీసుకుని చదును చేస్తున్న బాలకృష్ణ అనే దళారి? అన్ని తానే అంతా చూస్తా అంటున్న వైనం. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు తానే అంతా ఏవరికి ఏం మంచి చేయాలో తానే చూస్తుంటా అంటు స్థానికుల వద్ద హుకరింపులు? అసలు సదరు వ్యక్తికి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు దేనికి సహాకారం అందిస్తున్నారో.. అతని వెనుక ఉన్న ఆ అతీతమైన శక్తి ఏవరో తెలియక ఆ అక్రమ వ్యాపారాలకు ఆ వ్యక్తి దందాలపై స్థానికులు ఆగ్రహం! సదరు వ్యక్తి వలన ఆ ప్రాంతంలోని వారంతా అతనికి కావాల్సింది చేయకపోతే వారి నివాసాలపై సంబందిత అధికారులతో బెదిరించిన ఘటనలు లేకపోలేదంటు ఆవేధన స్థానికులలో భయం? అసలు ఏవరి బాలకృష్ణ ??? సంబందిత అధికారులకు మధ్య ఉన్న అవినాభావం ఏంటో అంటో ఆ అధికారులే బహిర్గతం చేయాల్సి ఉంది? ఇలా బెదిరించి వారి అమాయకత్వంను సొమ్ము చేసుకుని తన పబ్బం గడుపుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆ ప్రాంతంకు చెందిన వారు కోరుతున్నారు