పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు

సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ సత్తెనపల్లి నియోజకవర్గ పరిధి నకరికల్లు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన కుంకలగుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కవాతు నిర్వహించారు.ఎలక్షన్ కౌంటింగ్ అనంతరం జరిగిన చిన్న చిన్న సంఘటన వలన ఇరు వర్గాల వారు గొడవలు పడకుండా ఉండాలని మంగళవారం సాయంత్రం పోలీస్ కవాతునిర్వహించారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రజలు ఓటు హక్కువినియోగించు కున్న తర్వాత ఎన్నికలను మర్చిపోవాలన్నారు. అల్లర్లకు పాల్పడి గొడవలు చేయొద్దని యువత అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలని,ఎలక్షన్ కి ముందు కొందరి పైన బైండోవర్ కేసులు కూడా చేసామని అయినప్పటికీ కొందరు గొడవల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. కొంతమంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు.చదువుకునే విద్యార్థులు కూడా గొడవల్లో తలదుర్చుతున్నారు. పాత కేసుల పైన, రౌడీ షీటర్ల పైన, సస్పెక్ట్ షెటర్ల పైన ప్రత్యేక నిఘా కలిగి ఉన్నామని తెలియజేశారు. ప్రశాంత వాతావరణం పెంపొందించేందుకు గ్రామస్తులు సహకరించాలని, వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇష్ట రాజ్యాంగ రాష్ డ్రైవింగ్ చేయడం కూడదని ఎవరైనా నియమ నిబంధనలు, చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. రాంబాబు తో పాటు ఏపీఎస్పీ, వాళ్ల సిబ్బంది, ముప్పాళ్ళ ఎస్సై పి.హాజరత్తయ్య, నకరికల్లు ఎస్సై నాగేంద్ర, రాజుపాలెం ఎస్సై సమీర్ భాషా, మూడు మండలాల పోలీస్ సిబ్బందితో, పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.రాంబాబు తెలియజేశారు.