ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
August 07, 2024
క్రోసూరు
30 వసంతాలుగా ఏ బి సి డి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ కృషి ఫలించి నేడు వర్గీకరణ రావటం జరిగిందని ఎమ్మార్పీఎస్ మండల నేతలు ఆనందాన్ని పంచుకున్నారు.క్రోసూరు మండల ఎంఆర్పిఎస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో గ్రామ అధ్యక్షుడు సిద్దుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సురేష్ మాదిగ కేక్ కట్ చేశారు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోడవాటి కృపారావు మాదిగ కంచర్ల జానుబాబు మాదిగ నందిగం దేవదాసు మాదిగ లక్ష్మయ్య మాదిగ చిలక సురేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

