సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రులను కలిసిన, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరు కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కొండమోడు పేరేచర్ల జాతీయ రహదారి విస్తరణ అభివృద్ధికి నిధుల మంజూరు తో పాటు సత్తెనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్డు లోని రైల్వే గేట్ వద్ద ఆర్ఓబి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జాతీయ రహదారి మార్గంలో సత్తెనపల్లి పట్టణ పరిధిలోని అమరావతి మేజర్ కాలువపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి. నిధులు కేటాయించాలని.కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, రైల్వే మంత్రి జేపీ నడ్డాలను కోరారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుశ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు తో కలిసి సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోరుతూ కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర పౌరవిమానాయన మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులను కూడా కన్నా ఢిల్లీ పర్యటనలో కలిశారు.