నాయకులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. - ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

మనకి జీతాలు ఇచ్చే ప్రజలతో గౌరవంగా మెలగండి. పనుల నిమిత్తం వచ్చే ప్రజలను ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిప్పొద్దు. ప్రజల నుండి ఉద్యోగస్తులపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించను. ఉద్యోగస్తులందరూ సమయ పాలన పాటించండి విధి నిర్వాహనను బాధ్యతగా నిర్వహించండి మా పార్టీ వాళ్లు తప్పు చేసినా నా దృష్టికి తీసుకురండి. గ్రామాల్లో పారిశుధ్యంపై ద్రుష్టి వహించండి దోమల నివారణకు, రోడ్లపై నీటి నిల్వల నివారణకు చర్యలు తీసుకోండి. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోండి. ప్రతీ 3నెలలకు రివ్యూ మీటింగ్ ఉంటుంది గ్రామ పంచాయితీ బకాయిలు నెల రోజుల్లో వసూలు చేయండి. డొంక రోడ్లు బాగు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి రాబోయే రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయితీ, సచివాలయాలు సందర్శిస్తా. పెదకూరపాడు నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యాఖ్యలు. ఈరోజు 06 - 08 - 2024 (మంగళవారం) పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఎనికపాడు గ్రామంలో అమరావతి, పెదకూరపాడు మండలాలు మరియు పంచాయతీ కార్యదర్శుల మరియు అచ్చంపేట జడ్పి గెస్ట్ హౌస్ లో క్రోసూరుఅచ్చంపేట, బెల్లంకొండ మండలాల పంచాయితీ కార్యదర్సుల సమావేశాలు విడివిడిగా నిర్వహించి ఉద్యోగులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.