పేదల బియ్యం బొక్కేస్తున్న మాఫియా
August 07, 2024
గ్రామాల్లో మండలాల్లో రేషన్ మాఫియా చెల రేగిపోతుంది.
బెంజ్ న్యూస్
.అమరావతి,క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ లో విచ్చలవిడిగారేషణ్ మాఫియా.
నెలవారీ మామూళ్లకే సలాం కొడుతున్న పోలీస్.
క్రోసూరు
రేషన్ మాఫియా కు అడ్డు ఆపు లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు తెలిపారు. పేదల బియ్యం టన్నుల కొద్ది వేలం వేసి మిల్లులకు తరలిస్తున్న వైనం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. కొందరు దళారులు సిండికేట్ గా ఏర్పడి నెలవారీ మాములతో పోలీసులకు సలాం కొడుతూ, సివిల్ సప్లై అధికారులకు గులాం కొడుతూ, విజిలెన్స్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని గ్రామాల వారీగా మండలాల వారీగా తమ అనుచరులను ఏర్పాటు చేసుకొని స్థానిక నాయకులను తమ పార్ట్నర్లుగా ఏర్పాటు చేసుకొని రేషన్ మాఫియా కొనసాగిస్తున్నారు. గ్రామాలు దాటి మండలాలు దాటి జిల్లాలు దాటి ఎన్నో చెక్పోస్టులను ఎదుర్కొంటూ రేషన్ బియ్యం మూడు పూవులు ఆరు కాయలుగా వ్యాపారం మాఫియా కనుసనల్లో జరుగుతుందని స్థానిక ప్రజలు నిపుణులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఎన్నో నిఘానేత్రాలను కళ్ళు కప్పి పోలీస్ వ్యవస్థ కళ్ళు కప్పి నాలుగో స్తంభమైన మీడియా కళ్ళు కప్పి రాత్రి వేళల్లో చీకటి దొంగలు ఇష్టారాజ్యంగా తమ వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ చాప కింద నీరులా రేషన్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేసుకుంటూ కోట్లు కు పడగేస్తున్నట్లు తేటతెల్లమైంది. స్థానిక ఎమ్మెల్యేలు తమకు సంబంధం లేదన్నప్పటికీ స్థానిక చోటా బడా నాయకులతో నెలవారీ కొంత సొమ్ము ముట్ట జెప్పి అమరావతి అచ్చంపేట కోసూరు బెల్లంకొండ మండలాలలో ఇష్టారాజ్యంగా రేషన్ దందా నడుస్తుందని ప్రజలు తెలిపారు. నియంత్రించాల్సిన వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు అధికారులకు పలుమార్లు అవినీతికి పాల్పడవద్దు లంచాలు తీసుకోవద్దు అని చెప్పినప్పటికీ రేషన్ మాఫి అందించే లంచాలు మాత్రం దొంగ చాటుగా మింగేసి పోలీస్ వ్యవస్థ పూర్తిగా రేషన్ మాఫియా కుమ్ముకోస్తుందని ప్రజల బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. చీమ చుట్టుకుమన్న తెలిసే వ్యవస్థ వేల కన్నులు లక్షల కన్నులు రేషన్ బయటికి వెళ్తుంటే తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల మాటలు భేఖాతరు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజల కోరారు.