చైర్మన్గా దూదేకుల శ్రీను ఏకగ్రీవం

ఈపూరు బెంజ్ న్యూస్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అగ్నిగుండాలలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికల గురువారం ఎన్నికల అధికారి, ప్రధానోపాధ్యాయులు గొడుగు ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొన్న అనంతరం.ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున 1వతరగతి నుండి 8వ తరగతి వరకు24మంది సభ్యులు ఇతర ఎక్స్ అఫిషియో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం చైర్మెన్,వైస్ చైర్మనులుగా దూదేకుల శ్రీను,శీకాకొల్లి అంజినీలను ఎస్.యమ్.సి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రధానోపాధ్యాయులు గొడుగు ప్రతాప్,ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు గంగినేని రామారావులు, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి పాఠశాల,విద్య అభివృద్ధికి నిర్వహించ వలసిన విధివిధానాలు గురించి సభ్యులు, తల్లిదండ్రులుకు అవగాహన కల్పించరు.ఈ కార్యక్రమంలో ఆయా తరగతులకు చెందిన ఉపాధ్యాయులు తావురియ నాయక్ సుభాని,శైలజ,తులసిలక్ష్మి,రామకోటేశ్వరావు,బలుసుపాటి సత్యనారాయణ గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు.