పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
August 08, 2024
అమరావతి : బెంజ్ న్యూస్
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక కొరకు పోటీచేసిన పోసిపోగు చిన్న వెంకయ్య, మరియు మిద్దె తిరుపతిరావు అభ్యర్థుల బరిలో నిలిచారు. ఈ ఎన్నిక భాగంలో మిద్దె తిరుపతయ్య చైర్మన్ గా, పోసిపోగు చిన్న వెంకయ్య వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదాశివరెడ్డి, పాఠశాల మాజీ చైర్మన్ తాళ్లూరి చిన్న శాంతయ్య, టిడిపి నాయకులు రామచంద్రపు కోటి బాబు, టిడిపి సీనియర్ నాయకులు పెద్ద శాంతయ్య మరియు కంభంపాటి డేవిడ్, గడ్డి పర్తి సుబ్బారావు, తాళ్లూరు ఏసుదాసు,తుడుం పూర్ణ తదితరులు పాల్గొన్నారు.