ప్రమాదం చెప్పి రాదు. కానీ వెంటనే వాటి మీద డిజాస్టర్ రికవరీ చర్యలు చేపట్టడంలో యావత్తు యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తాడు.

స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా నేరుగా అక్కడికి వెళతాడు. కాబట్టే వెంట వెంటనే సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికిన మొదలై ప్రాణాలు నిలబెట్టడం నుండి సరైన వైద్యం అందడం వరకు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది యావత్తు యంత్రాంగం. తుఫాను అయినా మానవ తప్పిద ప్రమాదం అయినా.. ఏ మాత్రం అలక్ష్యం చెయ్యని మానవత్వం. దశాబ్దాలుగా అదే ఆయన అలవాటు. ఆయన ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయడు కాబట్టే.. పార్టీలు, సంఘాలు ఎవరు అక్కడికి వచ్చినా.. అంక్షలు గట్రా పెట్టరు. వేలెత్తి చూపేలా చెయ్యరు. ఎవరూ అడగక ముందే ఆయన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. నేరుగా వాస్తవాలు తెలుసుకొని, బాధితుల మాటలు విని, వారికి ధైర్యమై నిలబడతారు.