పల్నాడు జిల్లా.... పెదకూరపాడు నియోజకవర్గం.. మండల కేంద్రమైన అచ్చంపేట లోని షిరిడీ సాయిబాబా
August 16, 2024
మండపం లో పిళ్ళా వెంకటేశ్వరరావు కాపునాడు వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూని శెట్టి సత్య నారాయణ కు సన్మాన ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. అలాగే అచ్చంపేట మండలం అంబటిపూడి గ్రామ జనసైనికుడు జనసేన పార్టీ వీరాభిమాని జనసేన పార్టీ విజయాన్ని గురించి పురస్కరించుకొని 500 కిలోమీటర్లు తిరుపతి పాదయాత్ర పూర్తిచేసుకుని వచ్చిన సందర్భంగా ఈ సన్మానం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మట్టం వీరభద్రరావు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపి, పెదకూరపాడు నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షుడు జక్క సీతారాం కుమార్ ,పివిఆర్ రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడు సంకటి లక్ష్మణరావు , కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కడియం అంకమ్మరావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .