టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు మంగళగిరి స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలను పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి లచ్చన్న అని, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో వల్లభభాయ్‌పటేల్‌కు, ఏపీలో లచ్చన్నకు సర్దార్‌ బిరుదు ఉందని, వారిద్దరు తమ బిరుదును సార్థకం చేసుకుని దేశంలో, రాష్ట్రంలో సేవలందించారన్నారు. రైతుల కోసం శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. నేటితరం యువత ఆయనను మార్గదర్శకంగా తీసుకుని సమస్యలపై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, ఎంటీఎంసీ జనసేన అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతి రావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు కాండ్రు భాను కిషోర్, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, మున్నంగి శివ శేషయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, జొన్నాదుల బాలకృష్ణ, రుద్రు మురళీకృష్ణ, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, గోసాల రాఘవ, తన్నీరు కృష్ణ, తాత కోటయ్య, ఒడిశా నరేష్, తిరుమల శెట్టి మురళీకృష్ణ ,తుమ్మ శ్యాం, కాట్రు రవికుమార్, చింతా జగన్మోహన్ రావు, ఉయ్యూరు శీనుబాబు, చింతా సాంబశివరావు, పాగోలు శంకరరావు, ఇజ్జిగాని వీర శంకరరావు, ఇజ్జిగాని భవాని శంకర్, పంది అంకమ్మరావు, చింతా సత్యనారాయణ, పలగాని ప్రసాద్, పాగోలు ధర్మారావు, పలగాని సదాశివరావు, గోరా బాలాజీ, గోరా రంగారావు, జెముడుగాని మహి గౌడ్, వాకా సతీష్ కుమార్, జూపల్లి వెంకటేశ్వరరావు, కోవిలాకర్ రాకేష్ జి, పలగాని గంగాధర్, పలగాని నాగబాబు, చావలి వుల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.