నారా లోకేష్ చొరవ తో 15 ఏళ్ల సమస్యకు పరిష్కారం.

ంగళగిరి బాప్టిస్ట్ పేటలో మాతంగి అనిల్ కుమార్ ఇంటి దారి ఎదురు రోడ్డు పై కరెంట్ స్థంభం ఉంది. గత 15 సంవత్సరాల నుండి కరెంట్ స్థంభం మార్చాలని ఫిర్యాదులు చేసిన సమస్య పరిష్కారం కాలేదు. అనిల్ కుమార్ సమస్య ను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్ళారు. నారా లోకేష్ ఆదేశాలు మేరకు విద్యుత్తు శాఖ అధికారులు కరెంట్ స్థంభం ను తొలగించారు. ప్రజా దర్బార్ లో అర్జీ ఇచ్చిన 10 రోజుల లోపు సమస్య తీరడం తో మాతంగి అనిల్ హర్షం చేస్తూ నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.