ఇదీ చంద్రబాబoటే : శ్రేణుల సంబరాలు అమరావతి : బెంజ్ న్యూస్




 అమరావతికి కేంద్రం 15 వేల కోట్లు కేటాయించడంపై టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత చంద్రబాబు సమర్థతతోనే కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని కొనియాడారు. విభజన తర్వాత ఏపీకి కేంద్రం  ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది లేదు. వ్యూహాత్మకంగా ఎన్డీఏలో చేరటం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించటం  ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారంటూ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.