చౌట పాపాయిపాలెం నూతన సర్పంచిగా పేతురు నూతన బాధ్యతలు
సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
రాజుపాలెం మండల పరిధిలోని బీరవల్లిపాయ నూతన సర్పంచిగా పసుపులేటి వెంకటస్వామి, చౌట పాపాయిపాలెం నూతన సర్పంచిగా పేతురు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆశీస్సులతో గ్రామాలను అభివృద్ధి వైపు నడిపిస్తామని తెలిపారు.