సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
ఆంద్రప్రదేశ్ సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాల ప్రకారం, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ చల్లా నాగ వెంకట శ్రీనివాసరావు సూచనల మేరకు మోటార్ వాహనాల ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించడం అంశం పై సత్తెనపల్లి అమరావతి బస్ స్టాప్ సెంటర్లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్యానల్ న్యాయవాది ఆకుల నాగార్జున మాట్లాడుతూ హెల్మెట్ విరివిగా ధరించి ప్రమాదాలు నివారించాలి అని తెలిపారు అదేవిధంగా మోటార్ వెహికిల్ చట్టం 1988 లో పలు నేరాలు వాటి జరిమానాలు గురించి వివరించారు. రవాణా శాఖ అధికారి యు.ధర్మేందర మాట్లాడుతూ" ప్రతి రోజూ భారతదేశంలో హెల్మెట్ ధరించకుండా అధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు అని తెలిపారు , ప్రమాదాలు నివారించేందుకు హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా పాటించాలని సూచించారు. అదే విధంగా మైనర్ డ్రైవింగ్, లైసెన్స్, అధిక లోడు లాంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ మైనర్ పిల్లలుకు వాహనాలు ఇచ్చి ప్రమాద కారకులు అవకండి, మైనర్ డ్రైవింగ్ చట్ట రీత్యా నేరం అన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు షేక్ ఖాజావలి, షేక్ ముబారక్, కోర్టు కానిస్టేబుల్ తుపాకుల బాజి ,సలీం ఖాన్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మస్తాన్ రావు, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజానికం పాల్గొన్నారు.