గుంటూరు నుంచి వైకుంఠపురం వేద వ్యాస మహర్షి ఆలయం వరకు
వయా తాడికొండ, ఎండ్రాయి చావపాడు,పెదమద్దూరు మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలిగుంటూరు నుంచి విజయవాడ మీదుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ (లేక )నాన్ ఏసీ బస్సులను నడపండి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ గారికి అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈరోజు విజయవాడలోని బస్ భవన్ లో సాయంత్రం కలిసి విజ్ఞప్తిగుంటూరు, మంగళగిరి నుంచి వైకుంఠపురం వేద వ్యాస మహర్షి ఆలయం వరకు వయా తాడికొండ, ఎండ్రాయి చావపాడు,పెదమద్దూరు మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలి గడచిన పది సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో గల చావపాడు పెదమద్దూరు, వైకుంఠపురం కు గుంటూరు నుంచి డైరెక్ట్ బస్సు సదుపాయం లేదు అసలు చావు పాడు గ్రామానికి బస్సు సదుపాయమే లేదు ఎటు నుంచి వెళ్లాలన్న బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు ఈ విషయం పైన తొలు త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు భవన్లో బ్రహ్మానంద రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
తరువాత అదనపు కమిషనర్ చంద్రశేఖర్ గారికి కూడా కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది
గడిచిన ఎంతో కాలంగా విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సామాన్య ప్రయాణికులు వెళ్లే దానికి ఆర్టిసి బస్సులు లేకపోవడం అంతర్జాతీయ ప్రయాణికులు, దేశీయ ప్రయాణికులు, విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఎప్పుడో బస్సు నడిచేది తర్వాత కాలక్రమంగా బస్సును ఆపేశారు ఉదయం ఢిల్లీకి వెళ్ళడానికి, ఉదయం ఢిల్లీ నుంచి ప్రయాణికులు వచ్చిన వారి కి, సాయంత్రం ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు , సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్లో ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం వలన మహిళలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అని వినతిపత్రం ఇవ్వటం జరిగింది స్పందించిన అదనపు కమిషనర్ చంద్రశేఖర్ గారు తప్పకుండా స్టడీ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మాజీ ఎంపీటీసీ చిలకా వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్ చిలకా ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )