పెదకూరపాడు :బెంజ్ న్యూస్
మండల పరిధిలో ఉన్న 75 తాళ్లూరు గ్రామానికి చెందిన నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నేత కోసూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈద సాంబిరెడ్డి పై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. మండల పరిధిలోని కమ్మంపాడు ఉంగుటూరు మధ్ధ్యలో తాను ప్రయాణం చేస్తున్నా కారును ఆపి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఈద సాంబి రెడ్డికి రెండు కాళ్ళు రెండు చేతులు వీరిగాయి అని బంధువులు తెలిపారు. చికిత్స నిమిత్తం గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.