తమిళ రాజకీయాలలో సంచలనం

 


త్వరలో పాదయాత్రతో తమిళ ప్రజల దగ్గరకు హీరో విజయ్...

తమిళనాడు : బెంజ్ న్యూస్

తమిళ హీరో విజయ్ తమిళనాడులో రాజకీయ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు .. తమిళనాడు రాజకీయాల్లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్.ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరును ప్రకటించిన నటుడు విజయ్.. తమిళనాడులో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యంతో యాక్షన్ పాన్లుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న నటుడు విజయ్.త్వరలో పాదయాత్రకు సంబందించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు.100కు పైగా నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు సిద్ధం అవుతున్నారు.ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడులో అవినీతి, కులమత విభజన, అధికార దురాచారాలు వంటి సమస్యల పై పోరాటమే ఎజెండాగా నటుడు విజయ్ ప్రజలలోకి వెళ్లనున్నారు. విజయ్ రాజకీయ పాదయాత్రతో తమిళనాడులో రాజకీయగా ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే ...