బెంజ్ న్యూస్.దేశవ్యాప్తంగా మరో రెండు వారాలలో పండుగల సీజన్ ప్రారంభం కానున్నది. వినియోగదారులలో ఆరోగ్య పరిరక్షణ కోసం పెంపొందుతున్అవగాహన మరియు వృద్ధి చెందుతున్న జీవన ప్రమాణాలతో జీడిపప్పు వనియోగం ప్రతియేటా 7 శాతం చొప్పున వృద్ధి నమోదవుతున్నది.అయితే ప్రపంచ వ్యాప్తంగా జీడిపిక్కలు మరియు పప్పు ధరలు దీపావళి వరకు భారీగా పెరగగలవనే అంచనా వ్యక్తమవుతున్నది. భారత్లోని జీడిపిక్కల ఉత్పాదక ప్రాంతాలలో భారీ తరుగు నమోదవుతున్నది. అంతేకాకుండా వియత్నాం, ఆఫ్రికా లాంటి మరి కొన్ని దేశాలలో జీడిపిక్కల ఉత్పత్తి దాదాపు 25 శాతం తగ్గింది. ఎల్నినొ ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున జీడిపిక్కల ప్రపంచ ఉత్పత్తిలో 7 శాతం మేర తగ్గనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐవరి-కోస్ట్లో తమ దేశీయ వినియోగం కోసం జిడిపిక్కల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తద్వారా సరఫరా కుంటుపడి ధరలు పెరగడానికి దోహదపడుతున్నది. అయితే, ప్రస్తుతం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ధరలు శాంతించడంలేదు. ఉత్పాదక దేశాలలో జీడిపిక్కల ఉత్పత్తి తగ్గినందున ధర ఏప్రిల్-మే లో ప్రతి టన్ను 1200 – 1300 పలికిధర తాజాగా పెరిగి 1900-2000 డాలర్కు ఎగబాకింది. 2025 లో కోతల సీజన్ తర్వాత ధరలు దిగిరావచ్చని విశ్వసిస్తున్నారు. 2024 లో ప్రపంచ జీడిపిక్కల మార్కెట్ 782 కోట్ల డాలర్కు చేరగా 2029 నాటికి 3.31 శాతం వార్షిక వృద్ధి రేటుతో 920 కోట్ల డాలర్ తాకవచ్చని తెలుస్తోంది...