రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు..

 


    బెంజ్ న్యూస్.మార్కాపురం:- ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తాపడంతో పలువురికి గాయాలైన సంఘటన సోమవారం జరిగింది.కంభం నుండి మార్కాపురం వైపు వెళుతున్న కారు తిప్పాయపాలెం సమీపంలోకి వెళ్ళగానే ప్రమాదవశాత్తు పొలాల్లోకి దూసుకెళ్ళింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో అక్కడే ఉన్న రాచర్ల మండలం చోళ వీడు పంచాయతీ సర్పంచ్ గోతం వెంకటనారాయణ గాయపడ్డ వారిని అంబులెన్స్ సహాయంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...