గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహించే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 17న (శుక్రవారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.