రేపు గుంటూరులో జరిగే వైసిపి జిల్లా

సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలి: వైసిపి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు
4 తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ లో జరగనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైసిపి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం తాడేపల్లి బైపాస్ రోడ్ లోని క్రోమాలో వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం గుంటూరుని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ లో జరిగే వైసీపీ జిల్లాస్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య,పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు