ప్రభాస్ పై కృష్టవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రభాస్‌ను టాలీవుడ్ సరిగా వినియోగించుకోవడం లేదన్న దర్శకుడు కృష్ణవంశీ యాక్షన్ కథలకే ఆయనను పరిమితం చేస్తున్నారంటూ కృష్ణవంశీ వ్యాఖ్య ప్రభాస్.. మంచి పెర్ఫామర్, పని పట్ల అంకితభావంతో ఉంటాడని చెప్పిన కృష్ణవంశీ ప్రముఖ నటుడు ప్రభాస్‌ను టాలీవుడ్ సరిగా వినియోగించుకోవడం లేదంటూ దర్శకుడు కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఖడ్గం' రీ రిలీజ్ కానున్న సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పని పట్ల ప్రభాస్ అంకిత భావంతో ఉంటారని, మంచి పెర్ఫామర్ అని పేర్కొన్నారు. టాలీవుడ్ ఆయన్ను సరిగా వినియోగించుకోవడం లేదని అన్నారు. ఫైట్లకే పరిమితం చేస్తున్నారన్నారు. 'చక్రం'తో పాటు అదే సమయంలో వేరే యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీని తాను ప్రభాస్‌కు చెప్పగా, అందరూ యాక్షన్ కథలే చెబుతారు సర్ అంటూ ప్రభాస్ 'చక్రం' కథ ఎంపిక చేసుకున్నారని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి మారలేదని, ఇప్పటికీ దర్శకులంతా ఆయన్ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారన్నారు. గతంలో తాను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా తీయవచ్చని కానీ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అనుకున్న వెంటనే మూవీ తెరకెక్కించాలని తాను అనుకుంటానని, ఇతర ప్రాజెక్టులు పక్కన పెట్టి నా సినిమా చేయండి అని ప్రభాస్కు చెప్పలేను కదా అని కృష్ణవంశీ అన్నారు.