ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి ఇంచార్జ్ కిరణ్ దాస్,,,*వివిధ

సమస్యలపై ముఖ్యమంత్రికి సచివాలయంలో వినతి పత్రం అందజేత
విజయవాడ నగరానికి దుఃఖ దాయనిగా మారిన బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, పెద్ద బాబు ప్రాజెక్ట్ బాధితులు గోదావరి వరద బాధితులు పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలి, కృష్ణ జలాలు సరఫరా చేయాలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన గిరిజనులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలి చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివిధ సమస్యల మీద సచివాలయంలో సోమవారం వినతి పత్రాలను అందజేయడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. అనంతరం సచివాలయం వద్ద కామ్రేడ్ కే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో వరదలు వచ్చి విజయవాడతో సహా వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అదేవిధంగా ఇవ్వాలా మేము అక్కడ గమనించిన అంశాలను ముఖ్యమంత్రి కి తెలియజేయడం జరిగింది. ప్రత్యేకించి బుడమేరు, కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీల చేసిన తర్వాత తేలింది ఏమంటే బుడమేరు ప్రాంతమంతా కూడా అక్రమ నిర్మాణాలు ఆక్రమించుకున్నారు. అందువల్లనే వరద నీరుతో విజయవాడ ప్రాంతంలోని ఏరియాలో నీటితో మునిగిపోయాయని, ఆక్రమణ తొలగించకుండా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రమాదాన్నివారించడమనేది కష్టమవుతుంది. ఈ విషయమై సదర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చాము ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. బుడమేరు ప్రక్షాళన చేస్తామని ఆక్రమణలను తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోయినప్పటికీ, రాష్ట్రంలో దాతల నుంచి సమీకరించి డబ్బుతో, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆటో వాళ్లకి పదివేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి 25 రూపాయలు ఇవ్వాలని కోరాము. ముఖ్యమంత్రి కూడా పరిశీలన చేసి ఇప్పటివరకు 10000 సహాయం చేసాం అన్నారు. ఆయన పరిశీలించి సహాయం పెంచడానికి ఏమాత్రం అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల లో నివసించే కచ్చితంగా నష్టం అంచనా వేసి వారికి ఆర్థిక సహాయం అందజేయాలని కోరాము. గిరిజనులకు సహాయం కూడా సక్రమంగా అందలేదని అన్నారు. గతంలో కూడా మా రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవివీ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో సిపిఐ ప్రతినిధి బృందం రెండు రోజులపాటు తిరిగి పరిశీలించి పార్టీ తరపున వీలైనంత సాయం అందించడం జరిగిందని అన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు వచ్చి గిరిజన గ్రామాలను పరిశీలించిన వారి నుంచి ఎటువంటి సాయం అందలేదని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి అధికారులు పంపి నష్టపరిహారం అంచనా వేయించి తగు సహాయం అందజేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వరదలు రాకముందు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి దోనెపూడి శంకర్రావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు గంపలగూడెం మండలాలలో ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వారికి ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి. డయాలసిస్ సెంటర్లలో సరైన మౌలిక సదుపాయాలు లేక పరికరాలు లేక ఇబ్బంది పడుతున్నారు నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డయాలసిస్ లో ఉన్న వారిని కూడా వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పడం జరిగింది కలెక్టర్ కి కూడా చెప్పి దాన్ని మీద వివరంగా, వివరాలు తెప్పించుకొని సమస్యను పరిష్కరిస్తానే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య దాదాపుగా 6,7, ఏళ్ల నుంచి కొనసాగుతా ఉన్నది, దానిపైన మా కామ్రేడ్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు ఆధ్వర్యంలో పదేపదే పోరాటాలు చేసాము. దీక్షలు కూడా చేశాము అని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి మేము అడిగింది ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా భూములు ధరలు పెరిగాయి, ఆస్తుల ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా వేలం వేసి దాని ద్వారా బాధితులు అందరిని కూడా ఆదుకోవాలని మేము చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కూడా దాని మీద దృష్టి సారిస్తారనే నమ్మకంతో అది సక్రమంగా జరగటానికి అవకాశం ఉందని, వారి దృష్టికి తెచ్చాము దానిపైన ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దానిమీద ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చెయ్యమని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. అంతేకాకుండా ధర్మవరం ప్రాంతంలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి ఏ రకంగా చేనేత ఇబ్బందులు కలిగిస్తున్నారనే అంశం పైన జె పి వి సత్యనారాయణ మూర్తి, చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరావు ముఖ్యమంత్రికి వివరంగా వివరించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చేనేత సమస్యల పైన దృష్టి సారిస్తామని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పోలవరం మన రాష్ట్రానికి వర ప్రసాదిని అని, అలాంటి పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొట్రపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. పోలవరం లో నిర్వాసితుల సమస్యల పరిష్కార అంశాలలో కేంద్ర ప్రభుత్వం నత్తనడక వైఖరి అవలంబిస్తుందని అన్నారు. నిర్వాసితులకు అందించవలసిన పునరావాస ప్యాకేజీని అందించాలని ఆయన కోరారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. కాబట్టి నివాసితులకు ప్రధాన సమస్యగా తీసుకొని దాని పరిష్కారం చేయాలని కూడా ముఖ్యమంత్రి ని కోరడం జరిగింది .అదేవిధంగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి అటు తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే వాళ్లు జైల్లో చిరకాలంగా మగ్గుతూ ఉన్నారో వాళ్లను ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిని దాదాపుగా 213 మందిని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్నారు. అదేవిధంగా, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా విడుదల చేయాలని మేము కొనడం జరిగింది ఎందుకంటే దాదాపుగా 20, 22 ,సంవత్సరాలుగా చాలామంది దిక్కు దివానం లేని వాళ్ల లాగా వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రాలిపోతా ఉన్నారు. వారి గురించి ఎవరు ఆలోచించడం లేదు ఇవాళ ముఖ్యమంత్రిని మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి వెంటనే దాన్ని సంబంధించిన ఫైలు కూడా కూడా తెప్పించుకుంటా అన్నారు. దాని పూర్తిగా పరిశీలించి , చేస్తామన్నారు మేము ఇప్పుడే అనౌన్స్ చేయాలని కోరాము. దాని నుంచి వివరాలు తెప్పించుకొని అనౌన్స్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జరుగుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. తిరుమల లడ్డు వ్యవహారంపై ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులతో సీట్ కమిటీ వేశారు. లడ్డు వివాదంపై సీట్ దర్యాప్తులో తేలుతుందని, దానిపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరు కూడా మాట్లాడవలసిన అవసరం లేదని, దర్యాప్తులో ఏమైతదో తేలుతుందో దాని ఆధారంగా వెళ్తే బాగుంటుందని మేము చెప్పాము. కావున ఆ వివాదానికి స్వస్తి పలకాలని కూడా మేము ముఖ్యమంత్రినీ కోరాము. ముఖ్యమంత్రి కూడా మేము చెప్పిన సూచనతో ఆయన అంగీకరించారు అని రామకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, దోనేపూడి శంకర్, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, అల్లూరి జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, బత్తూరి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు