నేటి నుంచి రేషన్ కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు
October 11, 2024
నేటి నుంచి రేషన్ కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు
ఏపీలోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుంచి తక్కువ ధరకు వంట నూనెలు సరఫరా చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.124 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించనున్నట్లు పేర్కొన్నారు..