ఏపీ బెంజ్ న్యూస్* మంగళగిరి కిరణ్ దాస్.
October 08, 2024
ఆకుల ఉమామహేశ్వరపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్ర ఖండించారు
*ఆకుల ఉమామహేశ్వరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం ఎస్సీ నాయకులు
దురుద్దేశంతో టిడిపి నాయకులు ఆకుల ఉమామహేశ్వరావుపై లేనిపోని నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని శాలి మహేష్ అన్నారు. మంగళవారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సాలి మహేష్ అనే నేను కాటికాపరిగా ఎర్రబాలెం గ్రామంలో పనిచేస్తున్న. గతంలో పనిచేసిన సాలి బంగారయ్య అనే వ్యక్తి వాళ్ళ కుమారుడు నాగరాజు, గ్రామంలో ప్రస్తుతం కాటికాపరిగా పని చేస్తున్న నామీద దుర్భాషలాడుతూ, దౌర్జన్యం చేస్తూ, గ్రామ వైసీపీ నాయకుల అండదండలతో నామీద దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేస్తూ మద్యం మత్తులో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, గ్రామంలో ఉన్న పెద్దలు టిడిపి నాయకులు ఆకుల ఉమామహేశ్వరావు దగ్గరకు వెళ్లి సాలి బంగారయ్య, అతని కుమారుడు నాగరాజు, నన్ను దుర్భాషలాడుతూ నాపై దౌర్జన్యం చేస్తున్నారని ఉమామహేశ్వరరావు కి తెలియజేశానని మహేష్ అన్నారు. మహేష్ అనే వ్యక్తి ఉమామహేశ్వరావుకి చెప్పాడని దురుద్దేశంతో టీ స్టాల్ వద్ద,టీ తీయవద్దు మంచినీరు ఇవ్వద్దు కుర్చీ వేయవద్దని అపోహలు కల్పించి చెప్తున్నాడని మహేష్ మీడియా సముఖంగా తెలియజేశారు. గ్రామంలో పెద్దమనిషి అయిన టిడిపి నాయకులు ఆకుల ఉమామహేశ్వర మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం దుర్మార్గమని, కుల బేధం లేకుండా అందరితో సొంత మనిషి లాగా ఉండే ఆకుల ఉమామహేశ్వరం మీద లేనిపోని అబాండాలు వేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మహేష్ అన్నారు. వైసిపి నాయకులకి ఎస్సీలు అంటే చిన్న చూపు తగదని లేనిపోని కేసులు పెట్టించి ఇరికించటం వారికి అలవాటేనని అన్నారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీలం అంకారావు, గ్రామ మహిళా తెలుగుదేశం అధ్యక్షురాలు మేరిగా మేరీ, మండల ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి సాలి నరేష్ లు మాట్లాడుతూ ఆకుల ఉమామహేశ్వరరావు కులం పేరుతో దూషించాడని సాలి బంగారయ్య ఆరోపణలలో నిజం లేదని కావాలనే దురుద్దేశంతో వైసిపి నాయకులు తో కలిసి బంగారయ్య వారి కుమారుడు నాగరాజు, ఉమామహేశ్వరావు మీద లేనిపోని అబాండాల మోపుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి మానసిక వేదనకు గురి చేస్తున్నారని వారు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఎర్రబాలెం గ్రామంలో ఎన్నడూ లేనివిధంగా ఐదువేల పైగా ఓట్ల మెజార్టీ రావడం ఓర్చుకోలేని వైసీపీ నాయకులు కావాలనే ఆకుల ఉమామహేశ్వరం అనే వ్యక్తిపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం బాధాకరమని, ఇలాంటి దుర్మార్గమైన చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని వారు అన్నారు. నిజానిజాలు త్వరలో తేలతాయని వారు అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు కోడి రెక్కల ప్రభుదాస్, ముచ్చు మాణిక్యరావు, పల్లి ఎలిషా, తదితరులు పాల్గొన్నారు.