ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి కిరణ్ దాస్ ఇంచార్జ్
October 04, 2024
మంగళగిరి వీవర్ శాల ను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల ను గురువారం మధ్యాహ్నం సందర్శించారు. వీవర్స్ శాలలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న వివిధ రకాల శారీస్ ను పరిశీలించారు.. చీరలు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రతినిధి బృందంలో జయశర్మ, కేటీ, తదితర సభ్యుల కు వీవర్స్ శాల కమిటీ సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, కారంపూడి అంకమ్మరావులు వీవర్ శాల సంబంధించిన అనేక విషయాలు వారికి తెలియజేశారు. మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చేనేత కార్మికుల కు చేయూతనందించేందుకు వారికి అధునాతన డిజైన్లు నేర్పించడంతోపాటు ఆదాయం పెరిగే మార్గాలను ఈ వీవర్స్ శాల ద్వారా చేనేతకు కొత్త రూపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు..