ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

అచ్చంపేట
మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.నేషనల్ ఫండమెంటల్ లీగల్ రైట్స సిటిజన్ కన్జ్యూమర్ ఇంప్లిమెంట్ సొసైటీ వైస్ చైర్మ రాంబాబు ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.మహాత్ముని విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాంబాబు అన్నవరపు శ్రీనివాసరావు అడ్డగిరి పార్థసారథి సూరే సంపత్ కొప్పురావూరి కోటేశ్వరావు దేవరశెట్టి శ్రీను గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.