తాడేపల్లి.. బెంజ్ న్యూస్ సీఈఓ. ప్రసాద్.9010468481.గుంటూరు జిల్లా

అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు,ఇతర నాయకులు భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్‌కలాం జయంతి వేడుకలు మంగళవారం తాడేపల్లి పట్టణ స్థానిక టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి వల్లభనేని వెంకట్రావు,ఇతర టీడీపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌కలాం భారత అణురంగంలో అత్యున్నతస్థాయికి చేరి అనేక సేవలు అందించిన గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. ఆయన రాష్ట్రపతిగా దేశానికి సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు