ఏపీ బెంజ్ న్యూస్, మంగళగిరి ఇంచార్జ్ కిరణ్ దాస్ : 03-10-2024

మంగళగిరి లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన స్కిల్ సెన్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ సెన్స్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత కోసం స్కిల్ సెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరియు దాన్ని అమలు అయ్యే విధంగా మార్గదర్శనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ ఎన్యుమరేటర్లు శిక్షణ ఇచ్చి వారితో డేర్ టు డోర్ సర్వేను పైలెట్ ప్రాజెక్టు టేప్ లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబందించిన మ్యాసింగ్ పూర్తయింది. గ్రామసచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేకిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి IAS గారు ఈరోజు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీవర్స్ కాలనీ నందు జరుగుతున్నటువంటి స్కిల్ సిన్సన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమని కావున ప్రతి ఒక్కరూ ప్రతి హౌసను విజిట్ చేసి వారి పూర్తి వివరములను స్కిల్స్ యాప్ నందు నమోదు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రజల కూడా అవగాహన చేసుకుని ఈ స్కిల్ సెన్సస్ చేసే ఎన్యుమరేటర్లు కు సపోర్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న యువతకు కావలసిన నైపుణ్యం అందుతుంది మరియు వారి జీవనోపాధి మెరుగుపడుతుందని తెలియజేశారు. ప్రజలందరూ ఇది గమనించి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.