జీవిత l నైపుణ్యాలపై అవగాహన సదస్సు

బెంజ్ న్యూస్ .ఈరోజు గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్రోసూరు మండలం దొడ్లేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జీవిత నైపుణలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ కార్యకర్త లక్ష్మణ్ అధ్యక్షత వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బచ్పన్ బచావో స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతి రావు ు విచ్చేసి మాట్లాడుతూ పిల్లలకి జీవిత నైపుణ్యాలు తప్పకుండా అవసరం అన్నారు, మంచి కమ్యూనికేషన్ ఉంటే భవిష్యత్తు మంచిగా ఉంటదని చెప్పారు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ తన బలాలు బలహీనతలు తెలుసుకొని ముందుకు సాగాలన్నారు ప్రతి ఒక్కరూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు, ప్రతి ఒక విద్యార్థి తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఎలా చదువుతున్నాం ఎలా ముందుకు వెళ్లాలి అన్ని ఆలోచించుకొని చదవాలన్నారు, గుడ్ షెఫర్డ్ సంస్థ డైరెక్టర్ సిస్టర్ విన్నరాశి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డిసీజన్ మేకింగ్ నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండాలన్నారు జీవితంలో మనం ఏం చదవాలి ఎలా బతకాలి ఎలాంటి జాబు కావాలి అన్నారు కౌమార దశలో పిల్లలు అట్రాక్షన్ కు గురై వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్నారు అన్నారు కాబట్టి ప్రతి విద్యార్థిని టీచర్స్ తల్లిదండ్రులు చెప్పే విషయాలను విని భవిష్యత్తుని కాపాడుకోవాలి అన్నారు , ప్రధానో ఉపాధ్యాయురాలు పద్మ లతమాట్లాడుతూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది గుడ్ షెఫర్డ్ సంస్థ వారు మా పిల్లలకి మంచి జీవిత నైపుణ్యాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు , ఇలాంటి ట్రైనింగులు తీసుకొని భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది బాబు పవన్ కుమార్ విద్యార్థినీలు పాల్గొన్నారు: